Janasena: ఓటు వేసేందుకు వచ్చే వారికి బస్సులు ఏర్పాటు చేయండి: జనసేన

JanaSena Party Letter To ECI And APSRTC
  • ఎలక్షన్ కమిషన్ కు జనసేన పార్టీ నేతల వినతి
  • బాధ్యతతో వస్తున్నారంటూ మెచ్చుకున్న నాదెండ్ల మనోహర్
  • హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్ల రాక 

ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లినా బాధ్యతతో ఓటేయడానికి వస్తున్న వారికి బస్సులు ఏర్పాటు చేయాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఎలక్షన్ కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర సిటీల నుంచి జనం పెద్ద సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారని చెప్పారు. అయితే, పెద్ద సంఖ్యలో బస్టాండ్లకు చేరుకున్న జనాలకు సరిపడా బస్సులు లేవని తెలిపారు. బస్సుల కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్న వారి కోసం అదనంగా బస్సులు తిప్పాలని కోరారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులను కోరారు. ఈమేరకు జనసేన కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.

వాస్తవానికి ఓటేయడానికి పెద్ద సంఖ్యలో జనం వస్తారనే విషయం ముందుగానే అంచనా వేసి, అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని నాదెండ్ల మనోహర్ చెప్పారు. అయితే, ప్రస్తుతం అలాంటి చర్యలు ఏవీ చేపట్టినట్లు కనిపించడంలేదన్నారు. బాధ్యతను మరవకుండా ఓటేయడానికి వస్తున్న వారి కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయడం ఆర్టీసీ అధికారుల కనీస బాధ్యత అని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ సభలకు ఆగమేఘాలమీద బస్సులను ఏర్పాటు చేసే అధికారులకు రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల నుంచి ఏపీకి వస్తున్న జనాల సమస్యలు కనిపించడంలేదా అని నిలదీశారు. ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో వెంటనే అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని నాదెండ్ల మనోహర్ ఈ లేఖలో కోరారు.

  • Loading...

More Telugu News