Amit Shah: రిజర్వేషన్లపై తన వీడియోను ఎడిట్ చేయడంపై మరోసారి స్పందించిన అమిత్ షా

Amit Shah responds on video edit on reservations
  • బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని... రాజ్యాంగాన్ని మారుస్తుందని అబద్దపు ప్రచారం చేస్తోందని ఆగ్రహం
  • తెలంగాణలో బీజేపీ 10 లోక్ సభ స్థానాలు తప్పకుండా గెలుస్తుందని ధీమా
  • తెలంగాణలో బీజేపీకి 11 సీట్లలో గెలుపు అవకాశాలు ఉన్నాయని వెల్లడి

రిజర్వేషన్లు రద్దు చేస్తామని తాను చెప్పినట్లుగా... వీడియోను ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేశారని కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని... రాజ్యాంగాన్ని మారుస్తుందని అబద్దపు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో బీజేపీ 10 లోక్ సభ స్థానాలు తప్పకుండా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీకి 11 సీట్లలో గెలుపు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మోదీ ప్రధానిగా ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. మోదీ పాలనలో ఉగ్రవాద దాడులు లేవని పేర్కొన్నారు. బీజేపీకి 400 సీట్లు వస్తాయని తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.

తెలంగాణ ఏర్పడే నాటికి మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రం అప్పులపాలైందన్నారు. తెలంగాణలో రామగుండం ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నిర్మించామని... సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీని మంజూరు చేశామన్నారు. తెలంగాణలో ఎన్నో కీలక సంస్థలను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో ప్రభుత్వం స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు.

  • Loading...

More Telugu News