Naresh: కళ్లతోనే అమ్మ అందరినీ కంట్రోల్ చేసింది: సీనియర్ నరేశ్

Naresh Interview
  • అమ్మ క్రమశిక్షణ గురించి ప్రస్తావించిన నరేశ్ 
  • ఆమె అభిరుచిని గౌరవించానని వ్యాఖ్య 
  • అమ్మని తలచుకుని ఏడుస్తూనే ఉంటానని వెల్లడి 
  • తామంతా ప్రేమతో ఉంటామని వివరణ

విజయ నిర్మల .. నటిగా .. దర్శక నిర్మాతగా ఎన్నో విజయాలను అందుకున్నారు. కృష్ణగారితో కలిసి అనేక చిత్రాలలో నటించిన ఆమె, నరేశ్ హీరోగా ఎన్నో సినిమాలకి దర్శకత్వం వహించారు. అలాంటి విజయనిర్మల గురించి తాజా ఇంటర్వ్యూలో నరేశ్ ప్రస్తావించారు. "మా అమ్మ పిల్లలను ఎప్పుడూ కొట్టకూడదని చెప్పేవారు. అలా కొట్టకుండా ఆమె కళ్లతోనే కంట్రోల్ చేసేవారు" అని అన్నారు. 

"ఎవరి లైఫ్ స్టైల్ అయినా ఒక పధ్ధతి ప్రకారం ఉండాలనేది మా అమ్మగారి ఆలోచన. ఏ రోజున ఏ టిఫిన్ చేయాలనేది .. మెనూ ఏమిటనేది ముందుగానే సెట్ చేసి పెట్టేవారు. ఆమె రాసిన టైమింగ్స్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి, వాటినే మేము ఫాలో అవుతున్నాము. ఆమె ఉన్నప్పుడు ఎక్కడ ఏ వస్తువు పెట్టిందో .. అక్కడి నుంచి ఆ వస్తువును కదిలించలేదు" అని చెప్పారు. 

"అమ్మ ఉన్నప్పటి సంఘటనలు తలచుకుని నవ్వుకుంటాను .. ఏడుస్తాను కూడా. అమ్మకి మహేశ్ బాబు అంటే ఎంతో ప్రేమ. అతను కూడా పిన్నీ అంటూ ఎంతో ఆత్మీయంగా పిలిచేవాడు. కృష్ణగారి మిగతా పిల్లలు .. నేను చాలా సన్నిహితంగా ఉంటాము. ఒకరి కోసం ఒకరం ఉన్నామనే భరోసాతో ఉంటాము. మేమంతా అలా ఉండటానికి, కృష్ణ- విజయనిర్మలగారి నిస్వార్థమైన ప్రేమనే కారణం" అని అన్నారు.

  • Loading...

More Telugu News