pat cummins: బాలీవుడ్ పాటకు సన్ రైజర్స్ సారథి ప్యాట్ కమిన్స్ డ్యాన్స్.. ఇదిగో వీడియో

Dance India Dance ki Trophy to Chhod De Internet on Pat Cummins Viral Video
  • రిథమిక్ గా కాలు కదిపిన ఆసీస్ బౌలింగ్ స్టార్
  • పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి డ్యాన్స్ ప్రాక్టీస్
  • నెట్టింట వీడియో వైరల్.. తెగ మెచ్చుకుంటున్న ఫ్యాన్స్
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సారథి, ఆసీస్ స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్ బంతితోనే కాదు.. డ్యాన్స్ లోనూ అదరగొడుతున్నాడు! ఆసీస్ జట్టులో తన సహచరుడైన డేవిడ్ వార్నర్ ను తలదన్నేలా బాలీవుడ్ పాటలకు హుషారుగా స్టెప్పులేస్తున్నాడు!  

ఈ నెల 8న తన పుట్టినరోజు సందర్భంగా కమిన్స్ చేసిన డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. షాహిద్ కపూర్, కృతి సనన్ జంటగా నటించిన బాలీవుడ్ మూవీ ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’లోని చార్ట్ బస్టర్ పాట ‘లాల్ పీలీ అఖియా’ పాటకు రిథమిక్ గా స్టెప్పులేశాడు. 

ఆ వీడియోలో కమిన్స్ కుటుంబ సభ్యులు కూడా చిందేయడం విశేషం. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా కమిన్స్ మెల్లిగా హైదరాబాదీ సంస్కృతికి అలవాటుపడుతున్నట్లుందని కామెంట్ చేస్తున్నారు. కమిన్స్ ఇప్పటికే తన కుటుంబ సభ్యులకు హైదరాబాదీ బిర్యానీ రుచి చూపించేందుకు వారిని బయటకు తీసుకెళ్లాడు. అలాగే వచ్చీరాని తెలుగులో మాట్లాడుతూ ఫ్యాన్స్ ను అవాక్కు చేశాడు. అలాగే త్వరలో విడుదల కానున్న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలోని హుక్ స్టెప్ ను కూడా వేసి చూపించి అందరినీ ఫిదా చేశాడు.

ఈ వీడియో చూసిన నెటిజన్లంతా కమిన్స్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. క్రికెట్ లో విమర్శకుల ప్రశంసలు సైతం పొందిన కమిన్స్.. తన డ్యాన్స్ తో బాలీవుడ్ ను అవాక్కు చేయాలనుకుంటున్నట్లు కనిపిస్తోందని కామెంట్లు పెడుతున్నారు. డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ పోటీకి వెళ్తే కచ్చితంగా ట్రోఫీ గెలిచుకుంటాడని ధీమాగా చెబుతున్నారు.
pat cummins
Australia star bowler
dance
practice
video viral

More Telugu News