Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పై అరెస్టు వారెంట్

Nampally Court issued Arrest Warrent on SIB Ex chief Prabhakar Rao
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించిన దర్యాప్తు బృందం
  • కేసు నమోదు అయిన వెంటనే విదేశాలకు వెళ్లిపోయిన ప్రభాకర్ రావు
  • సీఆర్ పీసీ 73 సెక్షన్ కింద అరెస్ట్ వారెంట్ ఇవ్వాలని పిటిషన్ వేసిన పోలీసులు
  • అరెస్టు వారెంట్ జారీ చేస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై అరెస్టు వారెంట్ జారీ అయింది. సీఆర్ పీసీ 73 సెక్షన్ కింద ప్రభాకర్ రావుపై అరెస్టు వారెంట్ జారీ చేయాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు అందుకు అనుమతినిస్తూ ఆదేశాలిచ్చింది. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు నలుగురు పోలీసు అధికారులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు చాలా కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోయారు. ఇప్పటికే ఏ ఎయిర్ పోర్ట్ లో దిగినా పట్టుకునేందుకు వీలుగా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ప్రభాకర్ రావును పట్టుకునేందుకు ఇంటర్ పోల్ అధికారులను దర్యాప్తు బృందం సంప్రదించాలంటే కోర్టు అందుకు అనుమతించాల్సి ఉంటుంది.
Phone Tapping Case
SIB Ex Chief Prabhakar Rao
Arrest Warrent

More Telugu News