plane: విమానంలోని లగేజీ కంపార్ట్ మెంట్ లో నిద్రించిన మహిళ!

US Woman Climbs Into Overhead Bin Of Plane For Nap Internet Shocked
  • అమెరికాలో సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో ఘటన
  • వీడియో వైరల్.. అవాక్కయిన నెటిజన్లు
  • సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు
నిద్ర ముంచుకొస్తుండటంతో అమెరికాలో ఓ విమాన ప్రయాణికురాలు వెరైటీగా ఆలోచించింది. సీట్లో కూర్చొని ఇబ్బందిపడుతూ కునుకు తీసేకన్నా సీట్ల పైన ఉండే లగేజీ కంపార్ట్ మెంట్ లోకి దూరి హాయిగా పడుకోవచ్చుగా అనుకుంది. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా వెంటనే తన ప్లాన్ ను అమలు చేసేసింది. కాసేపు అందులోకి దూరి పడుకుంది. 

సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ‘న్యూయార్క్ పోస్ట్’ వెల్లడించింది. విమానంలోని మరో ప్రయాణికుడు తీసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. టిక్ టాక్ లో పోస్ట్ అయిన ఈ వీడియోకు ఏకంగా 50 లక్షల వ్యూస్ లభించాయి. ఆ తర్వాత ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలోనూ ఈ వీడియో దర్శనమిచ్చింది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా అవాక్కయ్యారు. రకరకాల కామెంట్లు పోస్ట్ చేశారు. ‘ప్రయాణికులకు నచ్చిన సీటును ఎంపిక చేసుకొనే అవకాశం సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ లో ఉన్నట్లుంది’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరొకరేమో ‘నా సీట్లో ఎవరు కూర్చున్నా పట్టించుకోను’ అని పోస్ట్ పెట్టాడు. కొందరు విమాన భద్రతపై ఆందోళన వ్యక్తం చేయగా ఇంకొందరేమో ఆమె అసలు అందులోకి ఎలా వెళ్లగలిగిందబ్బా అంటూ డౌట్ వ్యక్తం చేశారు.

2019లోనూ ఇదే తరహా ఘటన ఇదే ఎయిర్ లైన్స్ లో చోటుచేసుకుంది. టెన్నిసీలోని నాష్ విల్లే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళ లగేజీ కంపార్ట్ మెంట్ లో కనిపించి అందరినీ అవాక్కు చేసింది. అయితే దీనిపై అప్పట్లో ఆ ఎయిర్ లైన్స్ సంస్థ వివరణ ఇచ్చింది. ప్రయాణికులను కాసేపు సరదాగా నవ్వించేందుకే తమ ఫ్లైట్ అటెండెంట్ ఇలా చేసిందంటూ చెప్పుకొచ్చింది. 
plane
overhead storage compartment
US woman
climbs
nap
internet
amused

More Telugu News