Kantilal Bhuria: ఇద్ద‌రు భార్య‌లుంటే జాక్‌పాటే.. ఏడాదికి ఖాతాలో రెండు ల‌క్ష‌లు.. కాంగ్రెస్ నేత వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు!

Congress Leader Kantilal Bhuria Says Rs 1 Lakh to Women Double for Men With 2 Wives if Voted to Power
  • కాంగ్రెస్ నేత కాంతిలాల్ భూరియా ఎన్నిక‌ల ప్ర‌చారంలో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు
  • కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించిన మ‌హాల‌క్ష్మి ప‌థ‌కంపై నోరు జారిన కేంద్ర‌ మాజీ మంత్రి
  • ఈ ప‌థ‌కం కింద పేద మ‌హిళ‌ల‌కు ప్ర‌తి యేటా రూ. 1ల‌క్ష ఇస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌
  • అదే ఇద్ద‌రు భార్య‌లు ఉన్న వ్య‌క్తికి అయితే ఏడాదికి ఖాతాలో రెండు ల‌క్ష‌లు జ‌మ అవుతాయ‌న్న‌ భూరియా
కేంద్ర‌ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కాంతిలాల్ భూరియా గురువారం ఎన్నిక‌ల ప్ర‌చారంలో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రాట్లం నుంచి లోక్‌స‌భ ఎంపీగా బ‌రిలో ఉన్న ఆయ‌న కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించిన మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం గురించి మాట్లాడుతూ.. పేద మ‌హిళ‌ల‌కు ప్ర‌తి యేటా ఈ ప‌థ‌కం కింద రూ. 1ల‌క్ష ఇవ్వ‌డం జ‌రుగుతుంది. అదే ఇద్ద‌రు భార్య‌లు ఉన్న వ్య‌క్తికి అయితే ఏడాదికి ఖాతాలో రెండు ల‌క్ష‌లు జ‌మ అవుతాయ‌ని అన్నారు. సైలానాలో గురువారం ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న భూరియా ఇలా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలిచారు.
Kantilal Bhuria
Congress
Madhya Pradesh

More Telugu News