Allu Arjun: జ‌న‌సేనానికి అల్లు అర్జున్ మ‌ద్ద‌తు

Allu Arjun Supports Janasena President Pawan Kalyan
  • 'ఎక్స్' (ట్విట‌ర్‌) వేదిక‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మ‌ద్ద‌తు తెలిపిన బ‌న్నీ
  • ఒక కుటుంబ స‌భ్యుడిగా ఎప్పుడూ త‌న‌ మ‌ద్ద‌తు జ‌న‌సేన అధినేత‌కు ఉంటుంద‌న్న ఐకాన్ స్టార్‌
  • ప‌వ‌న్‌ కోరుకున్న‌ది సాధించాల‌ని ఆకాంక్షిస్తూ అల్లు అర్జున్‌ ట్వీట్
పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న‌ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారితో పాటు కుటుంబ స‌భ్యుల మ‌ద్ద‌తు పెరుగుతోంది. ఈ క్ర‌మంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా జ‌న‌సేనానికి త‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఎక్స్ (ట్విట‌ర్‌) వేదిక‌గా ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ బ‌న్నీ ప్ర‌త్యేకంగా ఓ ట్వీట్ చేశాడు. 

"మీ ఎన్నిక‌ల ప్ర‌యాణానికి నా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు. సేవ కోసం మీ జీవితాన్ని అంకితం చేయ‌డాన్ని చూసి గ‌ర్విస్తున్నాను. ఒక కుటుంబ స‌భ్యుడిగా నా మ‌ద్ద‌తు మీకు ఎప్పుడూ ఉంటుంది. మీరు కోరుకున్న‌ది సాధించాల‌ని ఆకాంక్షిస్తున్నా" అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఐకాన్ స్టార్ అభిమానులు కూడా ప‌వ‌ర్ స్టార్‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. ఇక‌ ఏపీలో ఎన్నిక‌ల ప్ర‌చారానికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ప్ర‌ధాన పార్టీల నేత‌లు జోరుగా ప్రచార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు.
Allu Arjun
Pawan Kalyan
Janasena
Tollywood

More Telugu News