Revanth Reddy: అమిత్ షా నన్ను భయపెట్టాలనుకుంటున్నారు: సీఎం రేవంత్ రెడ్డి

They are trying to use delhi police on me says cm revanth reddy
  • అమిత్ షా తనను బెదిరించాలని చూస్తున్నారన్న రేవంత్ రెడ్డి
  • బీజేపీ నేతలు ఈడీ, సీబీఐలాలా ఢిల్లీ పోలీసులను కూడా ఉపయోగించుకుంటున్నారని ఆరోపణ
  • వారు చేయాలనుకున్నది చేయవచ్చని, కోర్టులు ఉన్నాయని వ్యాఖ్య
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనను భయపెట్టాలని చూస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సీబీఐ, ఈడీ, ఐటీలను ప్రయోగించినట్లు తనపై ఢిల్లీ పోలీసులను ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. చేతిలో అధికారం ఉందని వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా చేయాలనుకుంటే కోర్టులు ఉన్నాయన్నారు. ఈ మేరకు ఆయన ఏఎన్ఐతో మాట్లాడారు. 

'అమిత్ భాయ్ నన్ను బెదిరించాలని చూస్తున్నారు. ఏదైనా రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా లేదా ఆ పార్టీ నాయకుడికి వ్యతిరేకంగా మార్ఫింగ్ వీడియోను విడుదల చేస్తే వారు ఫిర్యాదు చేయాలి. కానీ ఇక్కడ ఎంహెచ్ఏ ఫిర్యాదు చేసింది. అంటే బీజేపీ నేతలు ఈడీ, సీబీఐ వలె ఢిల్లీ పోలీసులను ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు వారు ఏం చేస్తారో చేయనీయండి. కోర్టులు ఉన్నాయి. నేను నా ట్విట్టర్ అకౌంట్ వివరాలు ఇచ్చాను' అని రేవంత్ రెడ్డి ఏఎన్ఐతో అన్నారు.
Revanth Reddy
Congress
Amit Shah
Lok Sabha Polls
BJP

More Telugu News