Chiranjeevi: నేడు పద్మ విభూషణ్ అందుకోనున్న చిరంజీవి... ఢిల్లీ చేరుకున్న రామ్ చరణ్, ఉపాసన

Ram Charan and Upasana arrives Delhi
  • మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించిన కేంద్రం
  • ఇటీవల అవార్డుల ప్రదానోత్సవం... హాజరుకాలేకపోయిన చిరంజీవి
  • నేడు ఢిల్లీలో అవార్డు ప్రదానం చేయనున్న రాష్ట్రపతి

మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే నాడు పద్మ విభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కేంద్రం పద్మ విభూషణ్ ఇద్దరికి ప్రకటించింది. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, చిరంజీవిలను ఈ విశిష్ట అవార్డుకు ఎంపిక చేసింది. ఇటీవల ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి చిరంజీవి హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో, ఆయనకు నేడు పద్మ విభూషణ్ ప్రదానం చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చిరంజీవి సతీసమేతంగా నిన్ననే ఢిల్లీ వచ్చారు. తాజాగా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో చిరంజీవి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా భారతదేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ స్వీకరించనున్నారు.

  • Loading...

More Telugu News