India: 'ఇండియా కూటమి'కి బదులు ఇండియా ఎయిర్‌లైన్స్‌కు ఓటేయాలన్న కాంగ్రెస్ అభ్యర్థి

Congress candidate asking to vote for INDIA AIRLINES instead of INDI Alliance
  • గుజరాత్‌లోని బనస్కాంత నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తోన్న జెనిబెన్ ఠాకూర్
  • మీడియాతో మాట్లాడుతూ టంగ్ స్లిప్ అయిన కాంగ్రెస్ అభ్యర్థిని
  • దేశం, గుజరాత్ ప్రజలు ఇండియా ఎయిర్ లైన్స్‌ను ఆశీర్వదించి బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని వ్యాఖ్య
లోక్ సభ ఎన్నికల్లో 'ఇండియా కూటమి'కి ఓటు వేయమని చెప్పడానికి బదులు ఇండియా ఎయిర్‌లైన్స్‌కు ఓటు వేయాలని ఓ కాంగ్రెస్ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గుజరాత్‌లోని బనస్కాంత లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున జెనిబెన్ ఠాకూర్ పోటీ చేస్తున్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ టంగ్ స్లిప్ అయ్యారు. ఇండియా అలయెన్స్‌కు బదులు ఇండియా ఎయిర్ లైన్స్‌కు ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈసారి భారతదేశం, గుజరాత్ ప్రజలు ఇండియా ఎయిర్‌లైన్స్‌ను ఆశీర్వదించి... కేంద్రంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఆమె పేర్కొన్నారు. గుజరాత్‌లో 26 లోక్ సభ స్థానాలు ఉండగా మంగళవారం జరిగిన మూడో దశలో 25 స్థానాల్లో పోలింగ్ జరిగింది.
India
BJP
Indian Airlines
Lok Sabha Polls

More Telugu News