sam pitroda: ఈశాన్యం వారు చైనీయుల్లా, దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లలా కనిపిస్తారు: శామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు

  • పశ్చిమ ప్రాంత వాసులు అరబ్ జాతీయుల్లా ఉంటారని కామెంట్స్
  • దేశ ఐక్యత గురించి వివరించే క్రమంలో ఆయన వాడిన భాషపై రాజకీయ దుమారం
  • కాంగ్రెస్ సిగ్గుపడాలన్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్
People In East Look Chinese South Like Africa New Sam Pitroda Flub

కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతీయ ఐక్యత గురించి వివరించే క్రమంలో ఆయన ఉపయోగించిన భాష రాజకీయ దుమారం రేపింది. పిట్రోడా వ్యాఖ్యలపై అధికార బీజేపీ దుమ్మెత్తిపోసింది. 

కోల్ కతాకు చెందిన ‘ద స్టేట్స్ మెన్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శామ్ పిట్రోడా భారత దేశాన్ని విభిన్నమైనదిగా అభివర్ణించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ‘దేశంలోని తూర్పు ప్రాంత ప్రజలు చైనీయుల్లా కనిపిస్తారు. పశ్చిమాన ఉండే వారు అరబ్ జాతీయుల్లా ఉంటారు. ఉత్తరాది వారు తెల్ల జాతీయులలా కనిపిస్తే దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లలా కనిపిస్తారు’ అని పేర్కొన్నారు.

పిట్రోడా కామెంట్స్ ను మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మతోపాటు బీజేపీ నేతలు తప్పుబట్టారు. ‘శామ్ భాయ్.. నేను దేశంలోని ఈశాన్య ప్రాంతానికి చెందిన వాడిని. నేను భారతీయుడిలా కనిపిస్తా. మేం చూసేందుకు భిన్నంగా కనిపించొచ్చు.. కానీ మేమంతా ఒక్కటే. దేశం గురించి కనీసం కొంచెమైనా అర్థం చేసుకో’ అంటూ హిమంత బిశ్వ శర్మ ‘ఎక్స్’లో కామెంట్ పోస్ట్ చేశారు.

మరోవైపు పిట్రోడాపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ విరుచుకుపడింది. ఆయన వ్యాఖ్యలు జాతి విద్వేష, దేశ ప్రజలను విభజించేలా ఉన్నాయని విమర్శించింది. ‘రాహుల్ గాంధీ మెంటర్ శామ్ పిట్రోడా. భారతీయుల గురించి ఆయన చేసిన జాతి విద్వేష, విభజన వ్యాఖ్యలను వినండి. వారి (కాంగ్రెస్ నేతలు) సిద్ధాంతమే దేశాన్ని విభజించి పాలించడం. సాటి భారతీయులను చైనీయులుగా, ఆఫ్రికన్లుగా అభివర్ణించడం దారుణం. ఇందుకు కాంగ్రెస్ సిగ్గుపడాలి’ అని కంగనా రనౌత్ ‘ఎక్స్’లో విమర్శించింది.

  • Loading...

More Telugu News