Dead bodies: నాలాలో కొట్టుకొచ్చిన మృతదేహాలు.. బేగంపేట్ లో విషాదం

Two Dead Bodies In Begumpet Nala
  • ఓల్డ్ కస్టమ్స్ బస్తీలో గుర్తించిన స్థానికులు
  • బస్తీవాసుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు
  • గాంధీ ఆసుపత్రికి మృతదేహాల తరలింపు

హైదరాబాద్ లో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి నాళాలు పొంగిపొర్లాయి.. వర్ష బీభత్సానికి బాచుపల్లిలో ఓ గోడ కూలి ఏడుగురు చనిపోగా బేగంపేట్ లో నాళాలో రెండు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. ఓల్డ్ కస్టమ్స్ బస్తీలోకి కొట్టుకువచ్చిన ఈ మృతదేహాలను స్థానికులు బుధవారం ఉదయం గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను గుర్తించే ఆనవాళ్ల కోసం క్లూస్ టీం ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. చనిపోయింది ఎవరనేది గుర్తించే ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని పోలీసులు చెప్పారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి మార్చురీలో భద్రపరిచినట్లు వివరించారు. మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News