Rohit Sharma: డ్రెస్సింగ్ రూంలో రోహిత్‌శర్మ కన్నీళ్లు.. ఫ్యాన్స్ ఆందోళన.. వైరల్ వీడియో ఇదిగో!

Why Rohit Sharma breaks down in MI dressing room
  • అనుకున్నంతగా రాణించలేకపోతున్న రోహిత్‌శర్మ
  • చెన్నైపై సెంచరీ తర్వాత మూగబోయిన బ్యాట్
  • తొలి ఏడు ఇన్నింగ్స్‌లలో చేసింది 297 పరుగులు మాత్రమే
  • ఫామ్‌పై ఆందోళనతోనే కన్నీళ్లు పెట్టుకున్నాడా?

డ్రెస్సింగ్ రూంలో రోహిత్‌శర్మ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ మరోమారు పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ తర్వాత రోహిత్ మళ్లీ బ్యాట్ ఝళిపించలేకపోతున్నాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందు అభిమానులను ఇది ఆందోళనకు గురిచేస్తోంది.

ఈ సీజన్‌లో రోహిత్ ఇప్పటి వరకు తొలి ఏడు ఇన్నింగ్స్‌లలో 297 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో చెన్నైపై చేసిన సెంచరీతోపాటు ఢిల్లీ కేపిటల్స్‌పై చేసిన 49 పరుగులున్నాయి. ఆ తర్వాత అతడి బ్యాట్ మూగబోయింది. ఆ తర్వాత ఐదు మ్యాచుల్లో అతడు చేసింది 34 పరుగులు మాత్రమే. వీటిలోనూ నాలుగుసార్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. 

ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో నాలుగు పరుగులు మాత్రమే చేసి డ్రెస్సింగ్ రూముకు చేరిన రోహిత్.. ఆ తర్వాత ఆవేదనగా ముఖం దించుకున్నాడు. ఆ తర్వాత అదుపు కాని కనీళ్లు ఉబికి వస్తుంటే తుడుచుకున్నాడు. ఇది కాస్తా కెమెరాలకు చిక్కి సోషల్ మీడియాకు ఎక్కడంతో వైరల్ అయింది. రోహిత్ కన్నీళ్లకు కారణం ఏంటో తెలియక అభిమానులు బాధపడుతున్నారు. ఏమైందని ఆరా తీస్తూ కామెంట్లు పెడుతున్నారు. బహుశా వరుసగా విఫలం అవుతుండడమే అతడి ఆవేదనకు కారణం కావొచ్చని అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News