Yuzvendra Chahal: చాహ‌ల్ అరుదైన రికార్డు.. తొలి భార‌తీయ ఆట‌గాడిగా ఘ‌న‌త‌!

Yuzvendra Chahal Becomes First Indian Player To Take 350 Wickets in T20s
  • టీ20 క్రికెట్‌లో 350 వికెట్లు తీసిన తొలి భార‌తీయ ఆట‌గాడిగా చాహ‌ల్‌
  • నిన్న‌టి ఢిల్లీతో మ్యాచులో పంత్ వికెట్ తీయ‌డం ద్వారా ఈ మైలురాయిని అందుకున్న స్పిన్న‌ర్‌
  • ఓవ‌రాల్‌గా 11వ ఆట‌గాడిగా ఘ‌న‌త
భార‌త స్టార్ స్పిన్న‌ర్ య‌జువేంద్ర చాహ‌ల్ మ‌రో అరుదైన రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్ (ఐపీఎల్‌+అంత‌ర్జాతీయ‌)లో 350 వికెట్లు తీసిన తొలి భార‌తీయ ఆట‌గాడిగా రికార్డుకెక్కాడు. ఓవ‌రాల్‌గా 11వ ఆట‌గాడిగా ఘ‌న‌త సాధించాడు. నిన్న‌టి ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచులో ఆ జ‌ట్టు కెప్టెన్ రిష‌భ్ పంత్ వికెట్ తీయ‌డం ద్వారా చాహ‌ల్ ఈ మైలురాయిని అందుకున్నాడు. 

ఇక ఈ జాబితాలో టాప్‌-10 స్థానాల్లో బ్రావో (625), ర‌షీద్ ఖాన్ (572), సునీల్ న‌రైన్ (549), ఇమ్రాన్ తాహీర్ (502), ష‌కీబ‌ల్ హ‌స‌న్ (482), ఆండ్రీ ర‌స్సెల్ (443), అబ్దుల్ రియాజ్ (413), ల‌సిత్‌ మ‌లింగ (390), త‌న్వీర్ (389), క్రిస్ జోర్డాన్ (368) ఉన్నారు.  

ఇక‌ పొట్టి ఫార్మాట్‌లో ఎప్పుడూ స్థిర‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకోవ‌డం య‌జువేంద్ర చాహ‌ల్ ప్ర‌త్యేక‌త‌. ఇటీవ‌లే ఐపీఎల్‌లో 200 వికెట్లు ప‌డ‌గొట్టిన బౌల‌ర్‌గా కూడా చ‌రిత్ర‌కెక్కాడు. అలాగే వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ టీమిండియాలో చోటు ద‌క్కించుకున్నాడీ లెగ్ స్పిన్న‌ర్‌.
Yuzvendra Chahal
Team India
Cricket
Sports News
IPL 2024

More Telugu News