Road Show: తిరుపతిలో నిలిచిన విద్యుత్ సరఫరా... చీకట్లోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ రోడ్ షో!

Chandrababu and Pawan Kalyan continues road show with flash lights after power cut in Tirupati
  • ఏపీలో మే 13న ఎన్నికలు
  • ముమ్మరంగా ప్రచారం చేస్తున్న కూటమి నేతలు
  • తిరుపతిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ రోడ్ షో
  • రోడ్ షో ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ తిరుపతిలో రోడ్ షోలో పాల్గొన్నారు. అయితే, రోడ్ షో నిర్వహిస్తున్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ చీకట్లోనే ఫ్లాష్ లైట్లతో రోడ్ షో కొనసాగిస్తున్నారు. చంద్రబాబు ఈ సాయంత్రం పుంగనూరు సభ అనంతరం తిరుపతి చేరుకోగా, పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి నేరుగా ఇక్కడికి వచ్చారు. కొద్దిసేపట్లో చంద్రబాబు, పవన్ తిరుపతి గాంధీ రోడ్ లో ఏర్పాటు చేసిన సభకు హాజరుకానున్నారు.
Road Show
Chandrababu
Pawan Kalyan
Tirupati
TDP
Janasena

More Telugu News