Chandrababu: మహనీయుల స్ఫూర్తిగా అణచివేతను ఎదిరిద్దాం: చంద్రబాబు

Chandrababu Tweet On Alluri Sitarama Raju Death Anniversary
  • అల్లూరి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ట్వీట్
  • బ్రిటీష్ పాలకుల క్రూరత్వాన్ని ఎదిరిస్తూ అల్లూరి ప్రాణత్యాగం చేశారన్న బాబు 
  • ఎన్నికల పోరాటంలో ప్రజలను గెలిపించాలని విజ్ఞప్తి
సామాన్యులపై జరిగే అణచివేతను మహనీయుల స్ఫూర్తిగా ఎదిరించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా చంద్రబాబు ట్వీట్ చేశారు. అల్లూరికి నివాళులు అర్పిస్తూ ఆ మహానుభావుడి స్ఫూర్తిని అంతా అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. గిరిజనుల పట్ల బ్రిటీష్ పాలకులు చూపించిన క్రూరత్వాన్ని అల్లూరి ఎదిరించారని, గిరిజనుల కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని మన పోరాటాన్ని ఉద్ధృతం చేయాలన్నారు. ఇన్నాళ్లూ చేసిన పోరాటం ఇప్పుడు ఎన్నికల రూపం దాల్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఎన్నికల పోరాటంలో ప్రజలను గెలిపించి రాష్ట్రాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు. సామాన్యులపై జరిగే ప్రతీ అణచివేతను ఎదిరించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.
Chandrababu
Twitter
Alluri Sitha Rama Raju
Alluri Death Anniversarry

More Telugu News