KKR: అనుకూలించని వాతావరణం.. కేకేఆర్ ఆటగాళ్ల విమానం రెండుసార్లు మళ్లింపు.. అయినా చేరని గమ్యస్థానం

  • గత రాత్రి లక్నో నుంచి కోల్‌కతా బయలుదేరిన కేకేఆర్ ఆటగాళ్లు
  • ప్రతికూల వాతావరణం కారణంగా తొలుత గువాహటికి మళ్లింపు
  • ఆ తర్వాత క్లియరెన్స్ లభించినా రెండోసారి అదే కారణంతో వారణాసికి
  • నేటి మధ్యాహ్నం కోల్‌కతాకు ఆటగాళ్లు
 KKR chartered flight diverted to Guwahati and then Varanasi due to bad weather

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ఈ నెల 11న కోల్‌కతా నైట్‌రైడర్స్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం కేకేఆర్ ఆటగాళ్లు చార్టర్డ్ విమానంలో లక్నో నుంచి గతరాత్రి కోల్‌కతాకు బయలుదేరారు. అయితే, వాతావరణం అనుకూలించని కారణంగా విమానాన్ని రెండుసార్లు దారి మళ్లించాల్సి వచ్చింది. తొలుత గువాహటి, ఆ తర్వాత వారణాసికి విమానాన్ని మళ్లించారు. 

కోల్‌కతాలో ప్రతికూల వాతావరణం కారణంగా విమానాన్ని గువాహటికి మళ్లించారని, తాము ఇప్పుడే ఇక్కడ ల్యాండ్ అయ్యామంటూ కేకేఆర్ ఫ్రాంచైజీ ఎక్స్ ద్వారా వెల్లడించింది. ఆ తర్వాత కాసేపటికే క్లియరెన్స్ లభించడంతో ఆటగాళ్లు తిరిగి కోల్‌కతా బయలుదేరారు. అయితే, ఆ తర్వాత తెల్లవారుజామున 1.20 గంటలకు మరోమారు ఎక్స్ చేస్తూ కోల్‌కతా వెళ్లాలన్న రెండో ప్రయత్నం కూడా ప్రతికూల వాతావరణం వల్ల విఫలమైందని, విమానాన్ని వారణాసి మళ్లించారని తెలిపింది.

చివరికి తెల్లవారుజామున 3 గంటలకు మరో అప్‌డేట్ ఇస్తూ.. ప్రస్తుతం తాము ఈ రాత్రి వారణాసి హోటల్‌లో ఉండబోతున్నట్టు తెలిపింది. మంగళవారం (నేడు) మధ్యాహ్నం కోల్‌కతా చేరుకుంటామని పేర్కొంది.

  • Loading...

More Telugu News