Mudragada Padmanabham: పవన్ కల్యాణ్ సీటుకే దిక్కు లేదు.. మెగా ఫ్యామిలీ హిస్టరీ ఏమిటో చెప్పాలి: ముద్రగడ

Pawan Kalyan has to talk about mega family history says Mudragada
  • భీమవరం, గాజువాకలో పవన్ ను తన్ని తరిమేశారన్న ముద్రగడ
  • ఇప్పుడు పిఠాపురంలో కూడా అదే జరుగుతుందని వ్యాఖ్య
  • పవన్ చెప్పేదంతా సొల్లు అని ఎద్దేవా

కాపు నేత, జనసేన నాయకుడు ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి జనసేనాని పవన్ కల్యాణ్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ మళ్లీ జరిగే ఎన్నికల్లో తన సోదరి క్రాంతికి టికెట్ ఇస్తానని చెప్పారు. ముద్రగడ, క్రాంతి ఇద్దరినీ కలుపుతానని చెప్పారు. ఈ నేపథ్యంలో ముద్రగడ స్పందిస్తూ... పవన్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పవన్ సీటుకే దిక్కు లేదని... తన కూతురుకి టికెట్ ఇస్తారట అంటూ ఎద్దేవా చేశారు. 

భీమవరం, గాజువాకలో పవన్ ను తన్ని తరిమేశారని... ఇప్పుడు పిఠాపురంలో కూడా అదే జరగబోతోందని ముద్రగడ అన్నారు. చంద్రబాబు ఎస్టేట్ లో మార్కెటింగ్ మేనేజర్ పవన్ కల్యాణ్ అని సెటైర్ వేశారు. మెగా ఫ్యామిలీ చరిత్ర ఏమిటో పవన్ చెప్పాలని అన్నారు. గురువు చంద్రబాబు ఆజ్ఞ ప్రకారం పవన్ నడుచుకుంటున్నారని విమర్శించారు. పవన్ చెప్పేదంతా సొల్లు అని అన్నారు. కులాలు, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టాలని మీ గురువు చెప్పారా? అని ప్రశ్నించారు. 

  • Loading...

More Telugu News