Bernard Hill: ‘టైటానిక్’ నటుడు బెర్నార్డ్ హిల్ కన్నుమూత!

Bernard Hill known For His Roles In Titanic The Lord Of The Rings Dies Aged 79
  • ఆదివారం హిల్ కన్నుమూసినట్టు వెల్లడించిన ఆయన ఏజెంట్
  • ‘టైటానిక్‌’లో నౌక కెప్టెన్ పాత్ర పోషించిన బెర్నార్డ్ హిల్ 
  • టైటానిక్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్‌లో సహాయక పాత్రలతో హిల్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు

టైటానిక్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన బ్రిటన్ నటుడు బెర్నార్డ్ హిల్ ఇకలేరు. ఆదివారం తెల్లవారుజామున హిల్ కన్నుమూసినట్టు ఆయన ఏజెంట్ ఓ ప్రకటనలో తెలియజేశారు. ఆస్కార్ గెలుచుకున్న టైటానిక్ మూవీలో బెర్నార్డ్ నౌక కెప్టెన్‌గా నటించారు. ఇక లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలో రోహన్  రాజు థియోడెన్‌గా ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్‌కు పీటర్ జాక్సన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. 

కెరీర్ తొలి నాళ్లల్లో బీబీసీలో ప్రసారమైన బాయ్స్ ఫ్రం బ్లాక్‌స్టఫ్ ఆయనకు గొప్ప గుర్తింపు, అనేక అవార్డులు తెచ్చి పెట్టింది. నాటి తరానికి చెందిన క్లాసిక్‌గా నిలిచింది. తాజాగా ఆయన మోర్గన్ ఫ్రీమెన్‌తో కలిసి బీబీసీలో మరో టెలివిజన్ సిరీస్‌లో నటించారు. స్థానిక కాలమానం ప్రకారం, తొలి ఎపిసోడ్ ఆదివారం ప్రసారం అయ్యింది.

  • Loading...

More Telugu News