Viral Video: జీవన్‌రెడ్డి నన్ను కొట్టలేదు.. ఎందుకలా నన్ను బజారుకు లాగుతారు: మహిళా కూలీ ఆవేదన.. వీడియో ఇదిగో

Woman who slapped by Jeevan Reddy explained about viral video
  • పువ్వు గుర్తుకే ఓటేస్తానన్న మహిళా కూలీపై జీవన్‌రెడ్డి చేయి చేసుకున్న వీడియో వైరల్
  • తన సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారన్న మహిళ
  • ఆ వీడియోను చూపించి తనను బద్నాం చేస్తున్నారని ఆవేదన
కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ నిజామాబాద్ లోక్‌సభ అభ్యర్థి టి. జీవన్‌రెడ్డి ప్రచారంలో ఓ మహిళా కూలీని చెంపదెబ్బకొట్టినట్టుగా చెబుతున్న వీడియో ఒకటి నిన్న వైరల్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో తాను కాంగ్రెస్‌కే ఓటేశానని, కానీ పెన్షన్ రావడం లేదని, ఈసారి కమలం గుర్తుకే ఓటేస్తానని ఆమె చెప్పడంతో జీవన్‌రెడ్డి వెంటనే ఆమె చెంపపై కొట్టినట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది.  ఈ వీడియో వైరల్ కావడంతో తాజాగా ఆ మహిళా కూలీ స్పందించింది.

జీవన్‌రెడ్డి తనను కొట్టలేదని, కొట్టినట్టు చూపించి తనను బద్నాం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు ఇల్లు లేదు, తోట లేదు, పింఛను కూడా రావట్లేదని, ఎవరు చెప్పినా ఇంతే అంటున్నారని ఆయనకు చెప్పానని తాజాగా వీడియోలో ఆమె పేర్కొన్నారు. తను చెప్పినది విని అన్నీ వచ్చేట్టు చేస్తానని చెబుతూ ‘దొరసానీ అట్లనే’ అంటూ తన చెంపపై చెయ్యి ఆనించి చెప్పారని వివరించింది.  దానిని చూపించి తనను కొట్టినట్టు చూపించి బద్నాం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
Viral Video
Telangana
Jeevan Reddy
Congress

More Telugu News