Harish Rao: దుబ్బాకలో ట్రాఫిక్‌ను నియంత్రించిన ఎమ్మెల్యే హరీశ్‌రావు.. వీడియో ఇదిగో

BRS MLA Harish Rao regulates traffic at Dubbaka following  congestion
  • దుబ్బాకలో నిన్న హరీశ్‌రావు రోడ్‌షో
  • జామ్ అయిన ట్రాఫిక్‌ను నియంత్రించిన సిద్దిపేట ఎమ్మెల్యే
  • వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్ల కామెంట్లు
సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు జామ్ అయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గత రాత్రి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి మెదక్ పార్లమెంటు అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా అక్బర్‌పేట-భూపల్లి మండల కేంద్రంలో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం దుబ్బాకలో ట్రాఫిక్ జామ్ ఏర్పడగా హరీశ్‌రావు కారు దిగి స్వయంగా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. 

అడ్డదిడ్డంగా వెళ్తున్న వాహనాలను నియంత్రించడంతో ట్రాఫిక్ క్లియర్ అయింది. దీంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. హరీశ్‌రావు ట్రాఫిక్‌ను స్వయంగా నియంత్రించడం అందరినీ ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపైనా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. హరీశ్‌రావు బెస్ట్ పొలిటీషియన్ అని ఒకరు కామెంట్ చేస్తే.. ట్రాఫిక్‌లో ఆయన ఇరుక్కుపోయాడు కాబట్టే ఇలా చేశారని మరొకరు, అధికారంలో లేనప్పుడే ఇలాంటివి గుర్తొస్తాయని ఇంకొకరు కామెంట్ చేశారు.
Harish Rao
Dubbaka
Lok Sabha Polls
Medak District
BRS

More Telugu News