Phone Tapping Case: మీడియా సంస్థల అధిపతుల ఫోన్లూ వదలని ప్రణీత్‌రావ్ అండ్ కో!

Telangana Phone Tapping Case Media Owners Phones Also Tapped
  • ప్రణీత్‌రావు బృందం ట్యాప్ చేసిన అన్ని ఫోన్ నంబర్లను గుర్తించిన దర్యాప్తు అధికారులు
  • మరింత లోతుగా సమాచారం సేకరిస్తున్న అధికారులు
  • ఫోన్లు ట్యాప్ అయిన విషయాన్ని ఆయా మీడియా సంస్థల అధిపతుల దృష్టికి తీసుకెళ్లిన దర్యాప్తు బృందం
ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్విన కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఎస్ఐబీ) ప్రధాన కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకుని మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అండ్ కో ట్యాప్ చేసిన దాదాపు అన్ని ఫోన్ నంబర్లను దర్యాప్తు అధికారులు గుర్తించినట్టు తెలిసింది. ఈ క్రమంలో తాజాగా కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. 

రాజకీయ ప్రత్యర్థులు, నాయకులు, వ్యాపారులే కాకుండా మీడియా సంస్థల అధిపతుల ఫోన్లు కూడా ట్యాప్ అయిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో దర్యాప్తు అధికారులు మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ట్యాపింగ్ కేసులో మీరూ బాధితులేనని, మీ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని, దీనికి సంబంధించి మీ వద్ద ఏదైనా అదనపు సమాచారం ఉంటే అందించాలంటూ దర్యాప్తు అధికారులు ఆయా మీడియా సంస్థల అధిపతులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.
Phone Tapping Case
Praneeth Rao
SIB
Media Owners
Telangana

More Telugu News