Pawan Kalyan: కొడాలి నానిని తిట్టాలనే కోరిక నాకు లేదు: పవన్ కల్యాణ్

 I have no desire to scold Kodali Nani says Pawan Kalyan
  • నేడు గుడివాడలో ప్రచారం నిర్వహించిన కొడాలి నాని
  • వంగవీటి రాధా పెళ్లికి వెళ్లినప్పుడు కొడాలి నాని తనకు కనపడితే కలిశానని వెల్లడి
  • నాని నోరును కట్టడి చేయాలంటే వెనిగండ్ల రామును గెలిపించాలని విన్నపం  

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిని తిట్టాల్సిన కోరిక తనకు లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కొడాలి నానిపై వ్యక్తిగతంగా తనకు ఎలాంటి శతృత్వం లేదని చెప్పారు. గుడివాడలో ఈరోజు పవన్ కల్యాణ్ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వంగవీటి రాధా పెళ్లికి వెళ్లినప్పుడు కొడాలి నాని తనకు కనపడితే కలిశానని చెప్పారు. కొడాలి నాని నోరును కట్టడి చేయాలంటే గుడివాడలో కూటమి (టీడీపీ) అభ్యర్థి వెనిగండ్ల రామును గెలిపించాలని విన్నవించారు. 

మరోవైపు పవన్ ప్రసంగిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కొందరు ఆయన ఫొటోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... తనకు జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఎన్టీఆర్ అభిమానులు, రంగా అభిమానులు వారి ఫొటోలను చూపిస్తున్నారని.... అందరు హీరోల అభిమానులకు ధన్యవాదాలు అని చెప్పారు. తనకు భగీరథుడి ఫొటోలు కూడా కనిపిస్తున్నాయని.... ఆయనను స్ఫూర్తిగా తీసుకుని పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News