Thummala: రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ముట్టుకునే ధైర్యం ఎవరికీ లేదు: తుమ్మల నాగేశ్వరరావు

Thummala Nageswara Rao says no one can touch Revanth Reddy government
  • రేవంత్ రెడ్డి కేబినెట్లో ఖమ్మం నుంచి ముగ్గురం మంత్రులం అయ్యామన్న తుమ్మల
  • లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం సీటును గెలిచి ఇవ్వాలన్న మంత్రి
  • తప్పుడు కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని మల్లు భట్టివిక్రమార్క హెచ్చరిక
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ముట్టుకునే ధైర్యం ఎవరికీ లేదని... ఆయన బలమైన శక్తిగా నిలబడతారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఎక్కడలేని మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఖమ్మంలో వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి కేబినెట్లో ముగ్గురం మంత్రులం ఉన్నామని... లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం సీటును గెలిచి ఇవ్వాలన్నారు. ఉమ్మడి ఖమ్మం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు.

రేవంత్ రెడ్డిపై తప్పుడు కేసులు: మల్లు భట్టివిక్రమార్క

సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్‌పై తప్పుడు ఆరోపణలు చేయవద్దన్నారు. ఖమ్మంలో థర్మల్ పవర్ స్టేషన్లు అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. సింగరేణిని కాపాడుతామని... దీనిని ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనీయమన్నారు. తాము రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా ఇస్తున్నామన్నారు. కొత్తగూడెం స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు.
Thummala
BJP
Congress
Revanth Reddy
Mallu Bhatti Vikramarka

More Telugu News