తొమ్మిది ప్రశ్నలతో జగన్ కు మరో బహిరంగ లేఖ రాసిన షర్మిల
- ఎన్నికల ప్రచారంలో జగన్ నే టార్గెట్ చేస్తున్న షర్మిల
- 'నవ సందేహాలు' పేరుతో బహిరంగ లేఖలు రాస్తున్న వైనం
- మద్యనిషేధం హామీని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తూ తాజాగా మరో లేఖ
లేఖలో షర్మిల లేవనెత్తిన నవ సందేహాలు:
- మద్యనిషేధం చేస్తామన్న హామీని ఎందుకు అమలు చేయలేదు?
- మద్య నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానన్నారు. మద్యం అమ్మకాలను భారీగా పెంచి.. ఓట్లు అడిగేందుకు ఎందుకొచ్చారు?
- మద్యం అమ్మకాల్లో ఆదాయాన్ని రూ. 20 వేల కోట్ల నుంచి రూ. 30 వేల కోట్లకు పెంచుకున్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగినట్టు కాదా?
- మద్యం అమ్మకాలను ప్రజల రక్తమాంసాలతో చేస్తున్న వ్యాపారం అని మీరు అన్నారు. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి?
- నకిలీ బ్రాండ్లను అమ్ముతూ ప్రజల జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు?
- బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రూ. 11 వేల కోట్లు సేకరించాలని ఎందుకు అనుకున్నారు?
- ఆసరా, అమ్మఒడి, చేయూత పథకాల అమలు బాధ్యతను బెవరేజెస్ కార్పొరేషన్ కు ఎందుకు అప్పగించారు?
- రాష్ట్రంలో 20.19 లక్షల మంది మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డారు. ఇవి మీ ప్రభుత్వ వైఫల్యం కాదా?
- మాదకద్రవ్యాలు పట్టుబడుతున్న రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఎందుకుంది?