dentists: బ్రష్ చేసుకొనేటప్పుడు ఈ పొరపాటుతో పళ్లు పసుపుపచ్చగా మారతాయంటున్న డెంటిస్టులు

Dentists Advice On Avoiding This Simple Toothbrushing Mistake For Yellow Teeth
  • టూత్ బ్రష్ ను తడపడం వల్ల పేస్ట్ నోట్లో సమాంతరంగా అంటుకుంటుందని వెల్లడి
  • అప్పుడు బ్రష్ కు ఉండే బ్రసిల్స్ మెత్తగా మారతాయన్న యూకే డాక్టర్
  • దీనివల్ల పళ్లను మృదువుగా శుభ్రం చేసేందుకు వీలవుతుందని వివరణ
పళ్లు తోముకొనేటప్పుడు చాలా మంది ఓ పొరపాటు చేస్తుంటారని.. దీనివల్ల దంతాల రంగు పసుపుపచ్చగా మారుతుందని డెంటిస్టులు చెబుతున్నారు. పళ్లు తోముకొనేటప్పుడు టూత్ బ్రష్ ను తడపడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు. ఇలా చేస్తే టూత్ పేస్ట్ నోట్లో అన్ని వైపులా సమానంగా అంటుకుంటుందని యూకేలోని ఈస్తటిక్ డెంటల్ కేర్ డాక్టర్ ఫెరఖ్ హమీద్ చెప్పారు. అలాగే దీనివల్ల పళ్లు మరింత శుభ్రపడతాయన్నారు. 

టూత్ బ్రష్ బ్రసిల్స్ ను నీటితో తడపడం వల్ల  అవి మెత్తగా మారతాయని.. అప్పుడు చిగుళ్లు, పళ్లను బ్రసిల్స్ మృదువుగా శుభ్రం చేస్తాయని డాక్టర్ హమీద్ వివరించారు. అలాగే నోటికి ఎలాంటి చికాకు లేదా నష్టం కలగకుండా పళ్లు తోముకోవచ్చన్నారు. 

‘బ్రష్ ను తడపకుండా పళ్లు తోముకోవడం లేదా ఎసిడిక్ ఫుడ్స్ తిన్న వెంటనే బ్రష్ చేసుకోవడం వల్ల దీర్ఘకాలంలో పళ్లు రంగు మారతాయి. పళ్లపై ఏర్పడే మరకలను పోగొట్టడంలో డ్రై బ్రషింగ్ తొలినాళ్లలో ఉపయోగపడుతుంది. కానీ బ్రష్ తడిగా లేకపోవడం వల్ల టూత్ పేస్ట్ పూర్తిగా అంటుకోదు. దీనివల్ల పళ్లు నిస్సారంగా మారతాయి. అలాగే ఎసిడిక్ ఫుడ్స్ తిన్న వెంటనే బ్రష్ చేసుకోవడం వల్ల పళ్లపై ఉండే ఎనామిల్ పొర క్రమంగా తొలగిపోతుంది. ఇది పళ్ల లోపలి పసుపు పొర బయటకు కనిపించేలా చేస్తుంది. అంతిమంగా పళ్లు జివ్వుమనడం లేదా రంగు మారడానికి దారితీస్తుంది. దీన్ని నివారించాలంటే ఎసిడిక్ ఫుడ్స్ తిన్న కాసేపటి తర్వాత బ్రష్ చేసుకోవాలి. దీనివల్ల ఎనామిల్ పొర బలోపేతం కావడంతోపాటు దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి’ అని బ్రిస్టల్ లైవ్ అనే మీడియా సంస్థతో మాట్లాడుతూ డాక్టర్ హమీద్ వివరించారు. పళ్ల సహజ రంగు, కాంతిని కాపాడుకోవాలంటే సరైన విధంగా, సరైన సమయంలో బ్రష్ చేసుకోవాలని సూచించారు.
dentists
tooth brush
yellow teeth
discoloration
advice

More Telugu News