AI controlled F-16: అమెరికా యుద్ధ విమానాన్ని నడిపిన కృత్రిమ మేధ

An AI controlled fighter jet took the Air Force leader for a historic ride
  • కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో ప్రయోగం
  • కృత్రిమ మేధ నడుపుతున్న యుద్ధ విమానంలో ప్రయాణించిన ఎయిర్‌ఫోర్స్ సెక్రటరీ
  • సాధారణ పైలట్‌ ఉన్న విమానానికి గట్టి పోటీ ఇచ్చిన ఏఐ విమానం
  • ఈ సాంకేతికత అభివృద్ధిపై విశ్వాసం వ్యక్తం చేసిన అమెరికా ఎయిర్‌ఫోర్స్ సెక్రటరీ
రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతున్న కృత్రిమ మేధ సాంకేతికత ప్రస్తుతం యుద్ధ విమానాన్ని నడిపే స్థాయికి చేరుకుంది. భవిష్యత్ యుద్ధాల్లో ఎదురయ్యే సవాళ్లకు అనుగుణంగా ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేసుకుంటున్న అమెరికా తాజాగా ఓ యుద్ధ విమానం నడిపే బాధ్యతను ఏఐకి అప్పగించింది. ఈ బాధ్యతను ఏఐ చక్కగా నిర్వర్తించింది. కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్‌బేస్‌లో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఏఐ నడుపుతున్న ఎఫ్-16 యుద్ధ విమానంలో ఏకంగా ఎయిర్ ఫోర్స్ సెక్రటరీ కూడా ప్రయాణించి ఏఐ సాంకేతికతను ప్రత్యక్షంగా వీక్షించడం గమనార్హం. 

ఈ ప్రయోగంలో భాగంగా సాధారణ పైలట్ నడుపుతున్న విమానంతో ఏఐ విమానం పోటీ పడింది. శత్రువిమానాలపై పైచేయి సాధించేందుకు ఉద్దేశించిన పలు గగనతల విన్యాసాల్లో ఏఐ విమానం సాధారణ పైలట్ విమానానికి గట్టి పోటీ ఇచ్చింది. ఏఐ యుద్ధ విమానంలో ఎయిర్‌ఫోర్స్ సెక్రటరీ సుమారు గంట పాటు ప్రయాణించారు. అనంతరం మీడియా సమావేశంలో ఏఐ గురించి మాట్లాడారు. 

‘‘ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోకపోవడం భద్రతా పరంగా ఓ పెద్ద రిస్క్. ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐ సాంకేతిక ఉండాల్సిందే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆయుధాల ప్రయోగానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే శక్తి ఈ సాంకేతికతకు ఉందని తాను నమ్ముతున్నట్టు తెలిపారు. 

ఈ సాంకేతిక ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నప్పటికీ ఏఐకి సంబంధించి అమెరికా ఎయిర్‌ఫోర్స్ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మొత్తం 1000 మానవరహిత, ఏఐ ఆధారిత యుద్ధవిమానాల ఫ్లీట్ ఏర్పాటే లక్ష్యంగా అమెరికా ముందడుగు వేస్తోంది. యుద్ధ విమానాల అభివృద్ధిలో కీలక మైలురాయిగా పేర్కొనే స్టెల్త్ టెక్నాలజీ (శత్రు దేశాల రాడార్లకు చిక్కకుండా చేసే సాంకేతికత) ఏఐకి ఉందని నిపుణులు చెబుతున్నారు.
AI controlled F-16
USA
California
Edwards Airforce Base
Experimental Flight

More Telugu News