Laxman: రిజర్వేషన్లపై కావాలనే తప్పుడు ప్రచారం... రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

  • లోక్ సభ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ అబద్దాలతో అడ్డదారులు తొక్కుతోందని విమర్శ
  • ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ నేతలు వర్గాల మధ్య ఘర్షణలు సృష్టిస్తున్నారని ఆరోపణ
  • అంబేద్కర్‌ను కాంగ్రెస్ పార్టీ పలుమార్లు అవమానించిందని విమర్శ
BJP MP Laxman takes on Revanth Reddy over reservation issue

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. రిజర్వేషన్లపై కావాలనే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... లోక్ సభ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ అబద్ధాలతో అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు. ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీ నేతలు వర్గాల మధ్య ఘర్షణలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

అంబేద్కర్‌ను కాంగ్రెస్ పార్టీ పలుమార్లు అవమానించిందని విమర్శించారు. ఆయన చేసిన రిజర్వేషన్ ప్రతిపాదనలు నెహ్రూకు నచ్చలేదని... అందుకే అంబేద్కర్‌ను ఓడించారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అంబేద్కర్‌కు గౌరవాన్ని పెంచినట్లు తెలిపారు. దళితులు, ఆదివాసీలకు అధికారం అందించిన ఘనత తమ పార్టీకే దక్కిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసును నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News