Revanth Reddy: నిన్నటి వరకు ఉక్కుపాదాలు.. నేడు వెల్లువెత్తిన అభిమానాలు.. సిద్దిపేట సభపై రేవంత్ ట్వీట్

Revanth Reddy tweets Siddipet road show photos
  • కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా గత రాత్రి మెదక్‌లో రేవంత్‌రెడ్డి రోడ్‌షో
  • పోటెత్తిన జనం ఫొటోలు షేర్ చేసిన సీఎం
  • బానిసత్వపు గోడలు బద్దలయ్యాయన్న రేవంత్

మెదక్ నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా గత రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి రోడ్ షో నిర్వహించారు. బీఆర్ఎస్‌కు కంచుకోట అయిన మెదక్‌లో జనం పోటెత్తారు. ఇసుకేస్తే రాలనంత జనం హాజరయ్యారు. తాజాగా, ఈ ఫొటోలను ఎక్స్‌లో షేర్ చేసిన రేవంత్‌రెడ్డి.. సిద్దిపేట రెక్కలు విప్పుకున్న హక్కుల విహంగమైందని అభివర్ణించారు.

సిద్దిపేటలో నిన్నటి వరకు ఉక్కుపాదాలు, అధికారం కప్పిపెట్టిన అణచివేతలు, అహంకారం తొక్కిపెట్టిన నికార్సైన నిజాలు ఉంటే, అక్కడ నేడు అభిమానం వెల్లువెత్తిందని, స్వేచ్ఛా నినాదాలు నింగినంటాయని, బానిసత్వపు గోడలు బద్దలయ్యాయని  రేవంత్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News