Rahul Gandhi: అమేథీ నుంచి గాంధీ ఫ్యామిలీ ఔట్.. రాయ్ బరేలీకి మారిన రాహుల్ గాంధీ

Rahul Gandhi contesting from Rae Bareli
  • అమేథీ నుంచి పోటీ చేస్తున్న కిశోరి లాల్ శర్మ
  • లోక్ సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న ప్రియాంకాగాంధీ
  • గత ఎన్నికల్లో అమేథీలో ఓడిపోయిన రాహుల్ గాంధీ

దశాబ్దాల కాలంగా గాంధీ కుటుంబానికి ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ, అమేథీ లోక్ సభ నియోజకవర్గాలు కంచుకోటల్లా నిలిచాయి. ఈసారి సోనియాగాంధీ రాజ్యసభకు వెళ్లారు. దీంతో, ఆమె స్థానంలో ప్రియాంకాగాంధీ రంగంలోకి దిగుతారని అందరూ భావించారు. రాయ్ బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి ప్రియాంకాగాంధీ పోటీ చేస్తారని అనుకున్నారు. అయితే లోతుగా చర్చలు జరిపిన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. 

రాయ్ బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడు అయిన కిశోరి లాల్ శర్మ పేరును హైకమాండ్ ప్రకటించింది. ఈ ఉదయం వీరి పేర్లను అధికారికంగా డిక్లేర్ చేసింది. అమేథీ నుంచి గాంధీ కుటుంబ సభ్యులు వైదొలగడం ఆసక్తికర అంశం. ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటీకి ప్రియాంకాగాంధీ దూరంగా ఉంటున్నారు. రాహుల్, కిషోరి లాల్ శర్మ ఇద్దరూ ఈరోజు నామినేషన్లు వేయనున్నారు. 

రాహుల్ గాంధీ రాయ్ బరేలీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో అమేథీ నుంచి ఓటమిపాలైన ఆయన... వయనాడ్ నుంచి గెలుపొందారు. గత ఎన్నికల్లో అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయన మళ్లీ అమేథీ నుంచి పోటీ చేస్తారని భావించినప్పటికీ... ఆయన రాయ్ బరేలీ వైపు మొగ్గు చూపారు. 2019లో రాయ్ బరేలీ నుంచి సోనియాగాంధీ గెలిచారు. అయితే, ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగి... రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

  • Loading...

More Telugu News