Revanth Reddy: హరీశ్ రావూ... రాజీనామా పత్రం సిద్ధంగా ఉంచుకో... పంద్రాగస్ట్ వరకే సిద్దిపేటలో నీ ఆటలు: రేవంత్ రెడ్డి

Revanth Reddy says harish rao should ready his resignation papers
  • పంద్రాగస్ట్ నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి
  • హరీశ్ రావు రాజీనామా తర్వాత సిద్దిపేట నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను గెలిపించుకుంటామని వ్యాఖ్య
  • సిద్దిపేట శనీశ్వరరావును పాతాళానికి తొక్కే బాధ్యత తనదే అన్న రేవంత్ రెడ్డి

'హరీశ్ రావూ... నీ రాజీనామా పత్రాన్ని సిద్ధంగా ఉంచుకో, పంద్రాగస్ట్ వరకే నీ ఆటల'ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సిద్దిపేటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ... పంద్రాగస్ట్ నాటికి రూ.2 లక్షల రైతు రుణమాఫీని చేస్తున్నామన్నారు. తన హామీని నెరవేర్చుకున్న తర్వాత హరీశ్ రావు రాజీనామా చేస్తే సిద్దిపేట నుంచి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానన్నారు. 2 లక్షల రుణమాఫీ చేయగానే సిద్దిపేటలో లక్ష మందితో భారీ సమావేశం నిర్వహిస్తానన్నారు.

సిద్దిపేట శనీశ్వరరావును పాతాళానికి తొక్కే బాధ్యత తనదే అన్నారు. ఆగస్ట్ 15 తర్వాత సిద్దిపేటకు స్వాతంత్ర్యం రాబోతుందన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి తన మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు ఇప్పటి వరకు ఇచ్చింది గాడిద గుడ్డు అని ఎద్దేవా చేశారు. బీజేపీ,  బీఆర్ఎస్ ఒక్కటేనని విమర్శించారు.

  • Loading...

More Telugu News