Congress: లోక్ సభ ఎన్నికలు... తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేయనున్న కాంగ్రెస్

Congress to release special manifesto for telangana
  • కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణకు ఏమేం చేస్తామనే అంశాలని పొందపరచనున్న కాంగ్రెస్
  • విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూల్స్ తదితర అంశాలకు ఇందులో చోటు
  • ఇప్పటికే న్యాయ్ పత్ర్ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేయనున్న కాంగ్రెస్

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేయనుంది. రేపు ఉదయం పదకొండు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేనిఫెస్టోను ఆవిష్కరించనున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణకు ఏమేం చేస్తామనేవి ఈ మేనిఫెస్టోలో వెల్లడిస్తారు.

రాష్ట్ర విభజన హామీల అమలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూల్స్ తదితర అంశాలకు ఇందులో చోటు దక్కనుందని తెలుస్తోంది. జాతీయ కాంగ్రెస్ ఇప్పటికే న్యాయ్ పత్ర్  పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. అయితే రేపు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రానికి ఏం చేస్తామనే వివరాలతో మేనిఫెస్టోను విడుదల చేయనుంది.

  • Loading...

More Telugu News