Pleasure Squad: ఏడాదికి 25 మంది అందమైన అమ్మాయిలు.. కిమ్ జోంగ్ ఉన్‌ కోరికలు తీర్చేందుకు ‘ప్లెజర్ స్క్వాడ్’!

  • తనను సంతోష పెట్టేందుకు కిమ్‌కు ప్రత్యేక బృందాలు
  • స్కూళ్లలోని తరగతి గదుల్లోకి వెళ్లి మరీ అందమైన అమ్మాయిల అన్వేషణ
  • శరీర ఆకృతి, దేశం పట్ల అమ్మాయిల కుటుంబాల నిబద్ధత ఆధారంగా స్క్వాడ్‌లోకి ఎంపిక
  • కన్యత్వ పరీక్షల అనంతరం రాజధాని ప్యాంగ్యాంగ్‌కు చేరవేత
  • నియంత కిమ్‌తో పాటు ఇతర ప్రధాన అధికారులు, రాజకీయ నాయకుల కోర్కెలను తీర్చడమే వారి పని
  • ఉత్తరకొరియా నుంచి తప్పించుకొచ్చి సంచలన విషయాలు వెల్లడించిన యోన్మీ పార్క్ అనే యువతి
a Report says that Kim Jong Un Handpicks 25 Pretty Girls Every Year For His Pleasure Squad

ఉత్తర కొరియా నుంచి తప్పించుకున్న యోన్మీ పార్క్ అనే యువతి ఆ దేశ అధినేత కిమ్ జాంగ్ ఉన్‌కు సంబంధించిన సంచలన విషయాలు బయటపెట్టింది. తనను సంతోష పెట్టేందుకు 25 మంది అందమైన అమ్మాయిలతో కూడిన ‘ప్లెజర్ స్క్వాడ్’ను కిమ్ నిర్వహిస్తున్నారని యోన్మీ పేర్కొంది. ప్లెజర్‌ స్వాడ్‌లో పనిచేసేందుకు ప్రతి ఏడాది 25 మంది వర్జిన్ అమ్మాయిలను కిమ్ ఎంపిక చేసుకుంటారని తెలిపింది. అమ్మాయిల ఆకృతి, దేశం పట్ల వారి కుటుంబ విధేయత ఆధారంగా యువతులను ఎంపిక చేసుకుంటారని యోన్మీ వివరించింది. ‘ప్లెజర్ స్క్వాడ్’లోకి తనను రెండు సార్లు పరిశీలించినప్పటికీ తన కుటుంబ నేపథ్యం కారణంగా తనను తిరస్కరించారని ఆమె వెల్లడించారు.

అమ్మాయిల కోసం వారు స్కూళ్లలోని ప్రతి తరగతి గదిలోకి వెళ్లి చూస్తారని, అందమైన వారు ఎవరైనా పొరపాటున మిస్ అవుతారనే ఉద్దేశంతో స్కూల్ గ్రౌండ్‌లలో కూడా తనిఖీ చేస్తారని వెల్లడించింది. కొంతమంది అందమైన అమ్మాయిలను గుర్తించిన తర్వాత తొలుత వారి కుటుంబ స్థితిగతులు తెలుసుకుంటారని, అనంతరం దేశం విషయంలో వారి నిబద్ధతను పరిశీలిస్తారని యోన్మీ తెలిపింది. ఉత్తర కొరియా నుంచి తప్పించుకున్న కుటుంబ సభ్యులు లేదా దక్షిణ కొరియా లేదా ఇతర దేశాలలో బంధువులు ఉన్న కుటుంబాల అమ్మాయిలను ‘ప్లెజర్ స్క్వాడ్’లోకి తీసుకునేవారు కాదని వివరించింది.

ఇక అమ్మాయిల ఎంపిక పూర్తయిన అనంతరం వారు కన్యలు అని నిర్ధారించడానికి వైద్య పరీక్షలు చేయిస్తారని, చిన్న లోపాన్ని గుర్తించినా వారిని పక్కనపెట్టేస్తారని యోన్మీ వివరించారు. కఠినమైన పరీక్షల అనంతరం అమ్మాయిలను రాజధాని ప్యాంగ్యాంగ్‌కు పంపుతారని, అక్కడ నియంత కోరికలను తీర్చాల్సి ఉంటుందని యోన్మీ వివరించినట్టు ‘మిర్రర్’ కథనం పేర్కొంది.

మూడు గ్రూపులుగా ‘ప్లెజర్ స్క్వాడ్’
‘ప్లెజర్ స్క్వాడ్’ను మూడు విభిన్న గ్రూపులుగా విభజిస్తారు. ఒక బృందానికి మసాజ్‌, మరొక బృందానికి పాటలు, డ్యాన్స్ చేయడంలో శిక్షణ ఇప్పిస్తారు. ఇక మూడవ సమూహం నియంత కిమ్ జోంగ్ ఉన్, ఇతర ఉన్నతాధికారుల లైంగిక కోర్కెలు తీర్చాల్సి ఉంటుంది. పురుషులను ఎలా సంతోషపెట్టాలో ఈ అమ్మాయిలు నేర్చుకోవాల్సి ఉంటుందని, అదే వారి ఏకైక లక్ష్యం అని యోన్మీ పార్క్ వివరించినట్టు ‘మిర్రర్’ కథనం పేర్కొంది.

ఎంపిక చేసిన అమ్మాయిలలో అత్యంత ఆకర్షణీయంగా ఉన్నవారిని కిమ్‌కు సేవ చేయడానికి కేటాయిస్తారు. ఇతర అమ్మాయిలు దిగువ స్థాయి జనరల్స్, రాజకీయ నాయకులను సంతృప్తి పరచడానికి కేటాయిస్తారని మోన్నీ పేర్కొన్నారు. కాగా ‘ప్లెజర్ స్క్వాడ్‌’లోని అమ్మాయి వయసు ఇరవైల మధ్యకు చేరుకుంటే వారి పదవీకాలం ముగిసినట్టుగా పరిగణిస్తారని ‘మిర్రర్’ కథనం పేర్కొంది. ఈ అందమైన అమ్మాయిలలో ఎక్కువ మంది కిమ్ అంగరక్షకులను వివాహం చేసుకుంటుంటారని తెలిపింది.  

కాగా ఈ ప్లెజర్ స్క్వాడ్ మూలాలు 1970ల నాటి కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్-2 కాలం నాటివని యోన్మీ పార్క్ చెప్పిందని ఆ కథనంలో వెల్లడించారు. లైంగిక సాన్నిహిత్యంతో మరణం ఉండదని కిమ్ జోంగ్-2 విశ్వసించేవారని, 2011లో గుండె పోటుతో ఆయన మృత్యువాతపడ్డాడని పేర్కొంది.

  • Loading...

More Telugu News