Tirumala: తిరుమలలో భారీ వర్షం

Heavy rain in Tirumala
  • తిరుమలలో మధ్యాహ్నం పూర్తిగా మారిపోయిన వాతావరణం
  • అరగంట సేపు జోరు వాన
  • భారీ వర్షంతో చల్లగా మారిపోయిన తిరుమల

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఎక్కడ చూసినా దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతతో జనాలను ఠారెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఎంతో మంది వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు నేడు తిరుమలలో భారీ వర్షం కురిసింది. భారీ ఎండలతో కొన్ని రోజులుగా అల్లాడిపోతున్న భక్తులు ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. ఉదయం నుంచి కూడా తిరుమలలో వాతావరణం కొంత చల్లగానే ఉంది. మధ్యాహ్న సమయానికి వాతావరణం పూర్తిగా మారిపోయి అరగంట సేపు జోరు వాన కురిసింది. ఈ వర్షంతో తిరుమల చల్లగా మారిపోయింది. మరోవైపు, కొండపై భారీ వర్షం కురిసినప్పటికీ... కింద తిరుపతిలో వర్షం లేకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News