Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ దర్శకుడిగా క్రిష్ స్థానంలో మరొకరు!

  • జ్యోతికృష్ణను దర్శకుడిగా తీసుకున్న నిర్మాతలు
  • క్రిష్ పర్యవేక్షణలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను జ్యోతికృష్ణ చేస్తారన్న మేకర్స్
  • ఊహించని జాప్యం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడి
Hari Hara Veera Mallu director Krish changed

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ 'హరిహర వీరమల్లు' నుంచి తాజాగా విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. పేదల పక్షాన నిలబడి పోరాడే యోధుడిగా పవన్ ఇందులో కనిపిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. అయితే టీజర్ విడుదల సందర్భంగా నిర్మాతలు ఒక కీలక ప్రకటన చేశారు. ఈ చిత్రం మిగిలిన షూటింగ్ ను, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను దర్శకుడు జ్యోతికృష్ణ పూర్తి చేస్తారని తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా క్రిష్ పర్యవేక్షణలో జ్యోతికృష్ణ చేస్తారని వెల్లడించారు. సినిమా పూర్తి చేయడంలో ఊహించని జాప్యం జరిగిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 

ఈ చిత్రాన్ని 17వ శతాబ్దంలో సాగే నేపథ్యంలో రెండు భాగాలుగా తీసుకురానున్నారు. 'స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో పార్ట్ వన్ ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. బాబీ డియోల్, సునీల్, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

More Telugu News