T20 World Cup 2024: టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌.. టీమిండియాకు అమితాబ్ ప్ర‌త్యేక‌ సందేశం.. నెట్టింట వీడియో వైర‌ల్!

Amitabh Bachchan Special Message to Team India amid T20 World Cup 2024
  • 'కల్కి 2898 ఏడీ' మూవీలోని అశ్వత్థామ అవతారంలో భార‌త క్రికెట‌ర్ల‌కు బిగ్‌బీ సందేశం
  • ‘టీ 20 ప్రపంకప్‌ 2024 కోసం శంఖనాదం మోగింది’ అంటూ ప్రత్యేక వీడియో మెసేజ్‌
  • స్టార్‌స్పోర్ట్స్ తో క‌లిసి క‌ల్కి చిత్రం యూనిట్ విడుద‌ల చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట హ‌ల్‌చ‌ల్
ఐసీసీ టీ20 వర‌ల్ట్‌క‌ప్ నేప‌థ్యంలో బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ టీమిండియాకు ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. ప్ర‌స్తుతం ఆయ‌న తెలుగులో నటిస్తున్న 'కల్కి 2898 ఏడీ' మూవీలోని అశ్వత్థామ అవతారంలో ‘టీ 20 ప్రపంకప్‌ 2024 కోసం శంఖానాదం మోగింది’ అంటూ ప్రత్యేక వీడియో ద్వారా భారత క్రికెట్‌ జట్టుకు స్పెషల్‌ మెసేజ్‌ ఇచ్చారు. స్టార్‌స్పోర్ట్స్ తో క‌లిసి క‌ల్కి చిత్రం యూనిట్ విడుద‌ల చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. క్రికెట్ అభిమానుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. 

"మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. విజయం ముందు తలొగ్గొద్దు. ఇది మహా యుద్ధం. ధైర్యంగా ఉండండి. మీ సామర్థ్యాన్ని ప్రదర్శించండి. ప్రతి ఒక్కరూ గర్వపడేలా చేయండి. శత్రువు కళ్లలోకి కళ్లు పెట్టి చూడండి. అప్పుడు దేశం కోసం మీరు సిద్ధమవుతారు" అంటూ భార‌త‌ క్రికెటర్లకు అమితాబ్‌ పిలుపునిచ్చారు.
ఇదిలాఉంటే.. సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'కల్కి 2898 ఏడీ'. 'మహానటి' ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. వైజయంతీ మూవీస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవ‌లే చిత్రం యూనిట్ ఈ సినిమాను జూన్ 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది కూడా. ఇక ఈ మూవీలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొణే, దిశా పటానీల‌తో పాటు కమల్‌ హాసన్‌, రాజేంద్రప్రసాద్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క‌ పాత్రల‌లో నటిస్తున్నారు.
T20 World Cup 2024
Amitabh Bachchan
Team India
Kalki 2898 AD

More Telugu News