Instagram: తల్లీకొడుకుల అసభ్య వీడియో.. ఇన్‌స్టాగ్రామ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు

  • ఇటీవల వైరల్ అయిన వీడియో
  • తీవ్రంగా పరిగణించిన జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్
  • పశ్చిమ బెంగాల్‌లోని దీనాజ్‌పూర్‌లో అప్‌లోడ్ అయిన వీడియో
  • అమెరికాలోని మెటా కార్యాలయానికి నోటీసులు
Pocso Case Against Instagram Over Mother And Son Indecent Content

తల్లీ, కుమారుడి అసభ్యమైన కంటెంట్‌కు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌పై పోక్సో, ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) ఆదేశాల మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. అనంతరం అమెరికాలోని మెటా కార్యాలయానికి ఈ మేరకు నోటీసులు పంపారు.

తల్లీకుమారుడు ముద్దులు పెట్టుకుంటూ అసభ్యంగా ప్రవర్తించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన ఎన్సీపీసీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ దీనాజ్‌పూర్‌ నుంచి అప్‌లోడ్ అయినట్టు గుర్తించారు.

ఇటువంటి వీడియోలను ప్రమోట్ చేస్తున్నందుకు తమ ముందు వ్యక్తిగతంతా హాజరు కావాలంటూ ఈ ఏడాది జనవరిలో యూట్యూబ్ ఇండియా అధికారులను ఎన్సీపీసీఆర్ ఆదేశించింది. ఆ తర్వాత మహారాష్ట్రలోనూ యూట్యూబ్‌పై కేసు నమోదైంది. ‘తల్లీకొడుకు చాలెంజ్’ వీడియోలు పోస్టు చేసినందుకు యూట్యూబ్‌పైనా పోక్సో కింద అభియోగాలు నమోదయ్యాయి.

More Telugu News