Alluri Seetarama Raju@50: సూపర్ స్టార్ కృష్ణ ఆల్ టైమ్ గ్రేట్ చిత్రం 'అల్లూరి సీతారామరాజు'పై మహేశ్ బాబు ఆసక్తికర ట్వీట్

Mahesh Babu tweets on his father remarkable movie Alluri Seetarama Raju
  • అల్లూరి సీతారామరాజుగా నటించి మెప్పించిన సూపర్ స్టార్ కృష్ణ
  • 1974 మే 1న రిలీజైన చిత్రం
  • నేటికి 50 ఏళ్లు పూర్తి

అల్లూరి సీతారామరాజు సినిమా సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో మేటి చిత్రంగా నిలిచిపోతుంది. తెలుగుజాతి మాత్రమే కాదు, యావత్ భారతావని గర్వించదగ్గ స్వాతంత్ర్య సమరయోధుడి జీవితకథను తెరకెక్కించగలిగిన తృప్తిని ఆ సినిమాతో కృష్ణ సొంతం చేసుకోగలిగారు. 

ఈ చిత్రం సరిగ్గా ఐదు దశాబ్దాల కిందట ఇదే రోజున (మే 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1974లో వచ్చిన ఈ చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక గొప్ప సినిమాగా గుర్తింపు పొందింది. 

ఈ నేపథ్యంలో, కృష్ణ తనయుడు మహేశ్ బాబు సోషల్ మీడియాలో స్పందించారు. "మొదటిసారి అల్లూరి సీతారామరాజు సినిమా చూసినప్పుడు స్క్రీన్ పై నాన్న గారి గంభీరమైన నటనను చూసి విస్మయానికి గురైన విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఈ సినిమా నేటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ మహోన్నత చిత్రం నటుడిగా నా ప్రస్థానంపైనే కాదు, తెలుగు సినిమాపైనా ప్రభావం చూపిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News