Amit Shah: రిజర్వేషన్ల రద్దు ప్రచారంపై మరోసారి స్పందించిన అమిత్ షా

  • కాంగ్రెస్ పార్టీ కుట్రలను ముందుకు సాగనిచ్చేది లేదన్న అమిత్ షా
  • అబద్దాన్ని గట్టిగా... పదేపదే చెప్పి ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని ఆగ్రహం
  • రిజర్వేషన్లను రద్దు చేయం... చేయనీయమని అమిత్ షా స్పష్టీకరణ
Amit Shah says bjp never eradicate reservations

బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. బీజేపీకి రిజర్వేషన్లు రద్దు చేసే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. ఆయన బుధవారం చండీగఢ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ కుట్రలను తాము ముందుకు సాగనిచ్చేది లేదన్నారు. అబద్దాన్ని గట్టిగా... పదేపదే చెప్పి ప్రజలను నమ్మించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు.

మోదీ మరోసారి గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెబుతున్నారని, పైగా తన ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఏనాడూ రిజర్వేషన్ల తొలగింపు గురించి ప్రస్తావించలేదని గుర్తు చేశారు. రిజర్వేషన్లు తాము రద్దు చేయమనీ... చేయనీయమని పేర్కొన్నారు.

ఎన్నికల్లో ఇండియా కూటమి ఓడిపోవడం ఖాయమన్నారు. ఆ తర్వాత ఆ నిందని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై వేస్తుందన్నారు. ఓడిపోయే కుటుంబం కోసం అసత్యాలు ప్రచారం చేయవద్దన్నారు. ప్రధాని మోదీ ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దు, బాలరాముడి మందిర నిర్మాణం, సీఏఏ అమలు చేశారన్నారు. అయిదేళ్లలో పలు రాష్ట్రాల్లో నక్సలిజం లేకుండా చేశామన్నారు. ఇదీ మోదీ గ్యారెంటీ అన్నారు.

More Telugu News