Prajwal Revanna: లైంగిక వేధింపుల ఆరోపణలపై తొలిసారిగా స్పందించిన ప్రజ్వల్ రేవణ్ణ

Prajwal Revanna first time responds on allegations
షార్ట్స్‌లో చూడండి
కర్ణాటకలో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై తీవ్రస్థాయిలో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం తెలిసిందే. ఆయన పెన్ డ్రైవ్ లో 3 వేల అశ్లీల వీడియోలు ఉండడం, అవన్నీ ఆయన లైంగిక వేధింపులకు పాల్పడిన మహిళల వీడియోలే కావడంతో ఈ వ్యవహారం సంచలనం సృష్టించింది. ఈ వీడియోలు బయటికి రావడంతో ప్రజ్వల్ రేవణ్ణ దేశాన్ని విడిచి జర్మనీ పారిపోయినట్టు కథనాలు వచ్చాయి. ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. 

కాగా, తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం పట్ల ప్రజ్వల్ రేవణ్ణ తొలిసారిగా స్పందించారు. ప్రస్తుతం తాను బెంగళూరులో లేనందువల్ల సీఐడీ విచారణకు హాజరు కాలేకపోతున్నానని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇదే విషయాన్ని తన న్యాయవాది ద్వారా సీఐడీ అధికారులకు తెలియజేశానని ప్రజ్వల్ పేర్కొన్నారు. త్వరలోనే నిజం గెలుస్తుందని స్పష్టం చేశారు. 

ప్రజ్వల్ రేవణ్ణ మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ మనవడు అని తెలిసిందే. ప్రజ్వల్ రేవణ్ణపైనే కాదు, ఆయన తండ్రి హెచ్ డీ రేవణ్ణపైనా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. మొత్తమ్మీద కర్ణాటక రాజకీయాల్లో ఈ అంశం పెను కుదుపులకు కారణమైంది.
Go Back to Shorts
Prajwal Revanna
Allegations
Pen Drive
Videos
JDS
Karnataka

More Telugu News