YS Sharmila: జగన్ కు నవ సందేహాలతో బహిరంగలేఖ రాసిన షర్మిల

YS Sharmila open letter to Jagan
  • జగన్ కు తొమ్మిది ప్రశ్నలను సంధించిన షర్మిల
  • నవ సందేహాలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్
  • డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారని ప్రశ్న
తన నవ సందేహాలకు సమాధానం చెప్పాలంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఏపీసీసీ చీఫ్ షర్మిల లేఖ రాశారు. సాగుభూమిని ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు ఆపేశారు? ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లించడం నిజం కాదా? 28 పథకాలను అర్థాంతరంగా ఎందుకు ఆపేశారు? విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు? సాగు భూమి ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు? 

ఎస్సీ, ఎస్టీ పునరావాస కార్యక్రమం ఏపీలో ఎందుకు నిలిచిపోయింది? ఎస్సీ, ఎస్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు ఎందుకు నిరాకరించారు? స్టడీ సర్కిళ్లకు నిధులు ఇవ్వకుండా ఎందుకు నిర్వీర్యం చేశారు? డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారు? అంటూ తన లేఖలో షర్మిల తొమ్మిది ప్రశ్నలను సంధించారు. ఎన్నికల ప్రచారంలో జగన్ నవరత్నాల గురించి గర్వంగా చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ కు షర్మిల నవ సందేహాలను సంధించారు.
YS Sharmila
Congress
Jagan
YSRCP

More Telugu News