KL Rahul: టీ20 వరల్డ్ కప్‌ బృందంలో దక్కని చోటు.. కేఎల్ రాహుల్‌కు మద్దతుగా బాలీవుడ్ నటుడు

Snubbed KL Rahul Gets Bollywood Stars Backing After T20 World Cup Omission
  • మంగళవారం టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్‌ను ప్రకటించిన బీసీసీఐ
  • ఎల్ఎస్‌జీ కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌కు దక్కని చోటు 
  • ఈ పరిణామంపై స్పందించిన సినీనటుడు రితేశ్ దేశ్‌ముఖ్
  • రాహుల్‌కు ఛాన్స్ ఇచ్చి ఉండాల్సిందంటూ నెట్టింట కామెంట్
టీ20 వరల్డ్ కప్‌లో కేఎల్ రాహుల్‌కు చోటు దక్కకపోవడం పలువురిని నిరాశ పరిచింది. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ రాహుల్‌కు మద్దతు నిచ్చాడు. వరల్డ్ కప్ స్క్వాడ్‌లో రాహుల్‌కు చోటుదక్కి ఉండాల్సిందంటూ ట్వీట్ చేశాడు. మంగళవారం బీసీసీఐ వరల్డ్ కప్ స్క్వాడ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. 

కేఎల్ రాహుల్ ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్‌కు సారథిగా ఉన్నాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న రాహుల్.. టోర్నీలో అత్యంత వేగంగా 400 పరుగులు చేసిన వికెట్ కీపర్‌గా నిలిచాడు. అయినా కూడా వరల్డ్ కప్‌ బృందంలో అతడికి చోటు దక్కకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. 

ఇక మంగళవారం ఏకనా స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. క్లిష్ట సమయంలో మార్కస్ స్టాయినిస్ నిలకడైన బ్యాటింగ్‌తో టీంను ఆదుకోవడంతో ఎల్‌ఎస్‌జీ విజయతీరాలకు చేరింది. 

144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎల్‌ఎస్‌జీ ఓపెనింగ్‌లోనే తడబడింది. ఆ తరువాత వచ్చిన మిడిలార్డర్ కూడా నిరాశపరిచింది. ఈ దశలో రంగంలోకి దిగిన మార్కాయిస్ నిలకడైన ఆటతీరుతో జట్టుకు మద్దతుగా నిలిచాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి అతడు నెలకొల్పిన 58 పరుగుల భాగస్వామ్యం జట్టు విజయానికి కీలకంగా మారింది. చివరకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కూడా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫామ్ లేమితో సతమతమయ్యాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఎల్ఎస్‌జీ.. 10 మ్యాచులకు 12 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది.
KL Rahul
T20 World Cup
Riteish Deshmukh
BCCI

More Telugu News