YS Jagan: ఇంత మంచి మనసున్న వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు: మైదుకూరులో సీఎం జగన్

CM Jagan praised his brother Avinash Reddy as having a good heart
  • అవినాశ్ రెడ్డిపై సీఎం జగన్ పొగడ్తలు
  • యువకుడు, ఉత్సాహవంతుడు అంటూ కితాబు
  • మీ చల్లని దీవెనలు నా తమ్ముడిపై ఉంచాలంటూ ప్రజలకు పిలుపు
సీఎం జగన్ ఇవాళ కడప జిల్లా మైదుకూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన కడప ఎంపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డి గురించి మాట్లాడారు. పక్కనే ఉన్న అవినాశ్ రెడ్డిని చూపిస్తూ... ఎడమవైపున నా తమ్ముడు అవినాశ్ ఉన్నాడు... యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేసే మనసుంది... ఇంత మంచి మనసున్నవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు అని కొనియాడారు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నా తమ్ముడిపై ఉంచాల్సిందిగా కోరుతున్నాను అంటూ విజ్ఞప్తి చేశారు. 

"ఈ జిల్లాలో మీ ప్రేమ, ఆప్యాయత, అభిమానాల వల్లే మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు... ఈ రాష్ట్రాన్ని మార్చేస్తున్నాడు... మీ ప్రేమాభిమానాలు, దీవెనలే నన్ను అడుగడుగునా కాపాడుతున్నాయి" అని సీఎం జగన్ వివరించారు.
YS Jagan
YS Avinash Reddy
YSRCP
Kadapa District

More Telugu News