Sitaara: 'సితార' సినిమాను నేను అనుకున్నట్టుగా తీయలేకపోయాను .. కానీ ఆ సీన్ అంటే ఇష్టం: వంశీ

  • 1984లో విడుదలైన 'సితార'
  • 40 ఏళ్లను పూర్తిచేసుకున్న సినిమా
  • హీరోయిన్ గా రాధను అనుకున్నట్టు వెల్లడి 
  • సుమన్ ఒప్పుకోవడానికి కారణం బ్యానర్ అని వ్యాఖ్య  

Sitara Interview

'సితార' సినిమా 1984లో పేక్షకుల ముందుకు వచ్చింది. ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకి, వంశీ దర్శకత్వం వహించాడు. ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో శరత్ బాబు .. సుమన్ .. భానుప్రియ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఆ సినిమా 40 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 'మహా మ్యాక్స్' వారు వంశీ - ఏడిద రాజాను ఇంటర్వూ చేశారు. 

వంశీ మాట్లాడుతూ .. 'సితార' సినిమాను నేను అనుకున్నట్టుగా తీయలేకపోయాను అనే ఒక అసంతృప్తి ఉంది. 'మహల్లో కోకిల' అనే కథను నేను రాసుకున్నాను. రాసుకున్నట్టుగా తీయలేకపోయాను. అందుకు కారణం అప్పుడున్న పరిస్థితులే. ఆ సినిమాలో కొన్ని సీన్స్ బాగుంటాయి. రాజావారు చనిపోయినప్పుడు ఊళ్లో వాళ్లంతా చూడటానికి వస్తారు. ఆ జనంలోనే ఆయన చెల్లెలు ఉంటుంది. ఆమెను అంతకుముందు ఎవరూ చూడకపోవడం వలన, వెనక్కి నెట్టేస్తూ ఉంటారు. ఆ సీన్ అద్భుతంగా వచ్చింది .. అదంటే నాకు ఇష్టం" అన్నారు. 

" ఈ సినిమాకి ముందు నేను ఎవరో సుమన్ కి తెలియదు. ఈ బ్యానర్లో చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ సినిమా ఒప్పుకున్నాడు. ఇక హీరోయిన్ గా రాధ బాగుంటుందని ఏడిద నాగేశ్వరరావు అనుకున్నారు. ఆమె లక్ష రూపాయల పారితోషికం అడగడంతో, కొత్త అమ్మాయిని చూడమని చెప్పారు. అప్పుడు భానుప్రియ ఈ ప్రాజెక్టులోకి వచ్చింది" అని చెప్పారు. 

  • Loading...

More Telugu News