Vijayawada: విజయవాడలో దారుణం... డాక్టర్ కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి

Five of one family seen dead in Vijayawada
  • ఇంటి బయట ఉరేసుకుని కనిపించిన డాక్టర్ శ్రీనివాస్
  • ఇంట్లో రక్తపు మడుగులో నాలుగు మృతదేహాలు
  • కుటుంబ సభ్యులను హత్య చేసి ఆపై ఆత్మహత్యకు పాల్పడినట్టుగా అనుమానం 
  • మృతుల్లో ఇద్దరు పిల్లలు
విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. డాక్టర్ డి.శ్రీనివాస్ (40) ఇంటి బయట ఉరేసుకోగా, ఇంటి లోపల శ్రీనివాస్ తల్లి రమణమ్మ (65), భార్య ఉష (38), ఇద్దరు పిల్లలు శైలజ (9), శ్రీహన్ (8) రక్తపు మడుగులో విగత జీవుల్లా కనిపించారు. 

ఆర్థోపెడిక్ నిపుణుడైన డాక్టర్ శ్రీనివాస్ విజయవాడలోని శ్రీజ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. ఆయన తన కుటుంబంతో కలిసి గురునానక్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కాగా, కుటుంబ సభ్యులను హత్య చేసిన తర్వాత, శ్రీనివాస్ ఇంటి ఆవరణలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. 

కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో ఆయన తన ఆసుపత్రిని లీజుకు ఇచ్చినట్టు తెలుస్తోంది. పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
Vijayawada
Deaths
Family
Suicide
Police

More Telugu News