Pak Leader: సూపర్ పవర్ కావాలని భారత్ కలలు కంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాకిస్థాన్ నేత మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్

  • ఇండియా, పాకిస్థాన్ లకు ఒకే రోజు స్వాతంత్ర్యం వచ్చిందన్న రెహ్మాన్
  • ఇస్లాం మతం ఆధారంగా పాక్ ఏర్పడిందని గుర్తు చేసిన వైనం
  • ఇప్పుడు పాకిస్థాన్ సెక్యులర్ దేశం అయిందని విమర్శ
India aiming to be superpower we are begging says Pakistani leader

పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి నానాటికీ దారుణంగా తయారవుతోంది. ఐఎంఎఫ్ నిధులు ఇవ్వకపోతే ఆ దేశ పరిస్థితి మరింతగా దిగజారే అవకాశం ఉంది. ఇదే అంశంపై పాకిస్థాన్ ఇస్లామిక్ నేత, జమాత్ ఉలేమా ఈ ఇస్లాం ఫజల్ పార్టీ అధినేత మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ ఆందోళన వ్యక్తం చేశారు. పాక్ నేషనల్ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇండియా, పాకిస్థాన్ రెండు దేశాలకు ఒకే రోజు స్వాతంత్ర్యం వచ్చిందని... ఇండియా సూపర్ పవర్ గా ఎదగాలని కలలు కంటుంటే... మనం మాత్రం దివాలా నుంచి బయటపడటానికి ఐఎంఎఫ్ ను అడుక్కుంటున్నామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ఇస్లాం మతం ఆధారంగానే పాకిస్థాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడిందని ఫజూర్ రెహ్మాన్ గుర్తు చేశారు. ఇప్పుడు పాకిస్థాన్ సెక్యులర్ దేశంగా తయారయిందని చెప్పారు. 1973 నుంచి కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ (సీఐఐ) ఇచ్చిన ఏ ఒక్క రెకమెండేషన్ ను కూడా ప్రభుత్వాలు పాటించనప్పుడు... ఇది ఇస్లామిక్ దేశం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇమ్రాన్ ఖాన్ కు చెందిన తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీకి ర్యాలీలు నిర్వహించుకునే హక్కు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కు ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News