Delhi Capitals: కేకేఆర్ తో మ్యాచ్... కష్టమ్మీద 153 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

DC scores 153 runs against KKR at Eden Gardens
  • ఈడెన్ గార్డెన్స్ లో కేకేఆర్ × ఢిల్లీ క్యాపిటల్స్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ
  • విఫలమైన కీలక బ్యాట్స్ మెన్
  • 35 పరుగులు చేసిన కుల్దీప్ యాదవ్
రిషబ్ పంత్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇవాళ కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో పరుగుల కోసం చెమటోడ్చింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు చేసింది. చివర్లో కుల్దీప్ యాదవ్ ధాటిగా ఆడడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. కుల్దీప్ 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 35 పరుగులు చేశాడు. 

కెప్టెన్ రిషబ్ పంత్ 27 పరుగులు సాధించాడు. పృథ్వీ షా (13), జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ (12), అభిషేక్ పోరెల్ (18), షాయ్ హోప్ (6), అక్షర్ పటేల్ (15), ట్రిస్టాన్ స్టబ్స్ (4) ఆశించిన స్థాయిలో రాణించలేదు. కోల్ కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, వైభవ్ అరోరా 2, హర్షిత్ రాణా 2, స్టార్క్ 1, నరైన్ 1 వికెట్ తీశారు.
Delhi Capitals
KKR
Eden Gardens
IPL 2024

More Telugu News