Prabhas: ప్రభాస్ సరసన ఆ ఇద్దరు హీరోయిన్లు!

Spirit Movie Update
  • 'స్పిరిట్' కోసం మొదలైన సన్నాహాలు 
  • 300 కోట్లతో రూపొందనున్న సినిమా 
  • డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ప్రాజెక్టు 
  • తెరపైకి కియారా - నయన్ పేర్లు   

ప్రభాస్ హీరోగా ఒక వైపున 'కల్కి' .. మరో వైపున 'రాజా సాబ్' సినిమాలు రూపొందుతున్నాయి. ఈ సినిమాల్లో ప్రభాస్ కి సంబంధించిన పోర్షన్ షూటింగు త్వరలో పూర్తికానున్నాయి. ఆ తరువాత నుంచి ఆయన సందీప్ రెడ్డి వంగతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. డిసెంబర్ నుంచి 'స్పిరిట్' సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకావొచ్చని సమాచారం. 

ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉండనున్నారు. ఒక కథానాయిక పాత్ర కోసం కియారా అద్వానీని .. మరో కథానాయిక పాత్ర కోసం నయనతారను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజంగా ఈ ఇద్దరినీ తీసుకోవడం జరిగితే, ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో పెరగడం ఖాయమనే చెప్పాలి.     

దక్షిణాది ప్రేక్షకులలో కియారాకు మంచి క్రేజ్ ఉంది. ఇక నయనతారకి ఇక్కడున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. అలాగే 'జవాన్' సినిమాతో అక్కడ కూడా నయనతార మార్కెట్ ఒక రేంజ్ కి వెళ్లిపోయింది. అందువలన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 300 కోట్ల రూపాయలతో ఈ సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే.
Prabhas
Kiara Adwani
Nayanatara

More Telugu News