కదులుతున్న రైలు ఎక్కబోయి జారిపడిన వ్యక్తి.. కాపాడిన మహిళా పోలీస్.. వీడియో ఇదిగో!
- కదులుతున్న రైలు ఎక్కబోయి పట్టాలకు, ప్లాట్ ఫామ్ కు మధ్య పడిన వ్యక్తి
- అది చూసి పరుగెత్తుకు వచ్చిన లేడీ కానిస్టేబుల్
- రైలు వెళ్లే వరకు ఆ వ్యక్తిని అదిమి పట్టుకున్న వైనం
- ఉత్తరాఖండ్ లోని లక్సర్ రైల్వే స్టేషన్ లో ఘటన
సీసీ కెమెరా ఫుటేజీతో..
ఉత్తరాఖండ్ లోని లక్సర్ రైల్వే స్టేషన్ లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కోల్ కతా–జమ్మూ తావి ఎక్స్ ప్రెస్ రైలులో వెళ్లాల్సిన ప్రయాణికుడు ఈ ప్రమాదానికి గురయ్యాడు. కాసేపు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికాడు. మహిళా కానిస్టేబుల్ ఉమ చొరవతో.. సురక్షితంగా బయటపడ్డాడు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీని ఉత్తరాఖండ్ పోలీసు విభాగం తాజాగా ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.
- ‘ఎక్స్’లో ఈ వీడియోను చూసిన నెటిజన్ల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ‘గుడ్ జాబ్.. ఉమకు అవార్డు దక్కాలి’ అని చాలా మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
- రైలు బోగీ మెట్లుగానీ, ఇతర భాగాలు గానీ తాకే ప్రమాదం ఉంటుందని తెలిసినా.. కానిస్టేబుల్ ఉమ ధైర్యంగా ప్రయాణికుడిని కాపాడిందని ప్రశంసలు వస్తున్నాయి.